నేనంత మర్యాదస్తుడిని కానమ్మా.. ఆయన పైన నేను కింద!
on Jan 8, 2026

సంక్రాంతికి రఫ్ఫాడిస్తాం పేరుతో సంక్రాంతి రోజు ప్రసారం కావడానికి సిద్ధంగా ఉన్న ఈవెంట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమోలో నాగబాబు, అనిల్ రావిపూడి, కృష్ణ భగవాన్, మాస్ మహారాజ రవితేజ వంటి వాళ్లంతా ఎంట్రీ ఇచ్చారు. ఈ ప్రోమోలో కొన్ని ఇంటరెస్టింగ్ సెటైర్స్ కౌంటర్స్ ఫన్నీగా ఉన్నాయి. "ఇప్పటి వరకు సంక్రాంతి పండగ ఇక నాన్న గారు వచ్చాక సంక్రాంతికే పండగ" అంటూ ఆది నాగబాబు గురించి చెప్పేసరికి "అరేయ్ సంక్రాంతి వచ్చిన నువ్వు మాత్రం ఇంటికి దండగేరా" అనేసరికి ఆది బాగా నవ్వుకున్నాడు. ఇంతలో కావ్య వచ్చి "మావయ్య గారు నన్ను ఆశీర్వదించండి" అంటూ వెళ్లి నాగబాబు కాళ్లకు దణ్ణం పెట్టుకుంటూ ఉండగా ఆది వచ్చి "నాన్న గారు ఖాళీగా ఉన్నా కలిపి ఆశీర్వదించేయండి" అంటూ ఆయన కళ్ళకు దణ్ణం పెట్టుకున్నాడు. తర్వాత కొత్త పెళ్లి జంట సాండ్రా-మహేష్ కి సంబందించిన సెలెబ్రేషన్స్ చేశారు. భోజనం కూడా పెట్టారు. "ఎన్నాళ్ళయింది పెళ్ళై మీకు" అంటూ అనిల్ రావిపూడి అడిగేసరికి "నెలన్నర" అని చెప్పాడు మహేష్. "అంతేనా అందుకు ఇలా చేశారు" అంటూ చెప్పాడు. సాండ్రా మహేష్ కి యాపిల్ ఇచ్చి "ఇది తిను ముందు" అంది. వెంటనే ఆది వచ్చి "యాపిల్ తిను డాక్టర్ బాబుకు దూరంగా ఉండొచ్చు" అంటూ కౌంటర్ వేసాడు. దానికి డాక్టర్ బాబు పడీపడీ నవ్వాడు.
"కృష్ణ భగవాన్ గారు మీ అత్తయ్యగారు మావయ్య గారు మీ పెళ్ళైన కొత్తల్లో వాళ్ళు చేసిన మర్యాదలు ఏంటి" అని సుమ అడిగింది. "నేను మర్యాదలు పుచ్చుకునేంత మర్యాదస్తుడిని కానమ్మా" అని చెప్పాడు. దానికి ఆది కిలకిలా నవ్వాడు. తర్వాత రవితేజ వచ్చారు. "సింధూరం నుంచి చూస్తున్నా రవిని.అతనొక అమేజింగ్ హీరో " అంటూ నాగబాబు చెప్పారు. "మీరు సింధూరం దగ్గర నుంచి చూసారు నేను రూంలోంచి చూసాను." అంటూ కృష్ణ భగవాన్ చెప్పారు. "కృష్ణబాబు ఏంటంటే కింద రూమ్ లో ఉండేవాళ్ళు నేను వైవిఎస్ చౌదరి పై రూమ్ లో ఉండేవాళ్ళము." అని రవితేజ చెప్పారు. "అందుకే ఆయన పైనున్నాడు నేను కింద ఉన్నా" అంటూ కృష్ణ భగవాన్ సెటైర్ వేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



